విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి
*25% ఉచిత విద్యను అందించాలి*
*జర్నలిస్టుల పిల్లలకు పీజుల రాయితీని ఇవ్వాలి*
*విద్యాశాఖ మంత్రిని నియమించాలి*
*ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలి*
సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా )పి డి ఎస్ యు
పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్
పిడిఎస్యు జిల్లా కమిటీ సభ్యులు పల్లవి
కరీంనగర్ సెప్టెంబర్ 13 ప్రశ్న ఆయుధం
శనివారం రోజున కరీంనగర్లో జరిగిన సమావేశంలో సిపిఐ( ఎంఎల్ )మాస్ లైన్ ( ప్రజా పంథా) పిడిఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కొరకు రాష్ట్రంలో విద్య వ్యవస్థ గాడి తప్పిందని ప్రభుత్వ విద్యా రంగంపై పాలకులు కనీస దృష్టి సారించడం లేదని దీనివలన అందరికీ ఉచితంగా అందవలసిన విద్య కొందరికి కూడా అందడం లేదని ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయని వీటిని పరిష్కరించే నాధుడే కరువయ్యారని ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలను ఆసరా చేసుకొని నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపార సరుకుగా చూస్తూ వేలల్లో లక్షల రూపాయలను ఫీజులు, డొనేషన్ల పేరుతో వసూళ్లు చేస్తున్నారని వీటిని నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు వ్యవహరిస్తూ ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ వాటి అభివృద్ధికి పరోక్షంగా మద్దతిస్తున్నారని పేర్కొన్నారు
గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో పేద విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయని గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్ప పరిష్కార చర్యలు ఏమీ లేవు అని ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు అని ఇచ్చిన హామీని హామీకే పరిమితం చేశారని కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు ఎన్ని జరిగిన ఆయా కళాశాలపై అధికారుల చర్యలు శూన్యమే రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని కళాశాలలకు విచ్చలవిడిగా అటనామస్ ఇస్తూ విద్యా ప్రమాణాలను తగ్గిస్తు రాష్ట్ర విద్యాశాఖ కి నేటికీ మంత్రిని కేటాయించలేదంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో ఉందో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలియజేస్తాయన్నారు
కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 20-20 ని అమలు చేస్తుందని తద్వారా విద్యకు మత రంగు పులిమి విద్యార్థులను మతోన్మాదులుగా తయారు చేయబోతుందని రాష్ట్ర యూనివర్సిటీలపై పెత్తనం కొరకు యూజిసీ నిబంధనలను సవరణ చేసిందని సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న అనేక అల్లర్లు అవి చేస్తున్న రౌడీ మూకలకు పరోక్ష మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర యూనివర్సిటీలో తన జోక్యం కొరకు పావులు కదుపుతుందని ఇప్పటికే దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ పరం చేసిన కేంద్ర ప్రభుత్వం విద్యను కూడా కార్పొరేట్ హస్త గతం చేయబోతుందని సిలబస్ లో లౌకిక అనే పదాన్ని తొలగించాలని, శాస్త్రీయ దృక్పథం ఉన్న అంశాలు, చరిత్రలో తిరుగుబాటు వీరుల చరిత్రను తొలగించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు
ఇలాంటి తరుణంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం, కనీస వసతుల ఏర్పాటుకై ఉద్యమించాలని, పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు వైష్ణవి, వెన్నెల ,అంజి, అశోక్ , వంశీకృష్ణ, ప్రశాంత్ , ప్రవీణ్ కుమార్ , ఎనోస్ కుమార్ , సందీప్ , సతీష్ , అరుణ్ చరణ్ తేజ నాయకులు తదితరులు పాల్గొన్నారు