*సృజనాత్మకతతో నేర్చిన విద్య మరుపు రానిది*
*
విజ్ఞాన్ లో విజయవంతమైన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
*హుజురాబాద్ ఫిబ్రవరి 22 ప్రశ్న ఆయుధం*
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం రోజున లీడ్ కరికులంలో భాగంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అలాగే ముందస్తు సైన్స్ డే ను నిర్వహించారు పాఠశాలకి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, లీడ్ స్టేట్ అకాడమిక్ డైరెక్టర్ దినేష్ రెడ్డి, లీడ్ అడ్వైజర్ ఐశ్వర్య లు హాజరయ్యారనీ పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తెలిపారు హాజరైన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలచే ప్రాజెక్టులు చేపించడం చాలా గొప్ప విషయమని, తాము చదువుతున్న కాలంలో మూస పద్ధతిలో నేర్చుకున్నామని కానీ ప్రస్తుతం విద్యార్థులందరూ సృజనాత్మకతతో నేర్చుకుంటున్నారని తెలిపారు. తదనంతరం లీడ్ స్టేట్ అకాడమీ డైరెక్టర్ దినేష్ రెడ్డి, స్లైడ్ ప్రజెంటేషన్ తో తల్లిదండ్రులకు వివరిస్తూ లీడ్ కరికులం అనేది దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న కరికులమని, ప్రస్తుత తరం విద్యార్థులకు తగ్గట్టుగా దీనిని ఏర్పాటు చేశామని, మార్కులే ప్రామాణికంగా కాకుండా విద్యార్థులు లర్నింగ్ బై డూయింగ్ మెథడ్ లో నేర్చుకుంటారని, దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పిల్లలు ఈ కరికులంలో నేర్చుకుంటున్నారని, సీబీఎస్ఈ పాఠశాలలకు దీటుగా ఈ కరికులం ఏర్పాటు చేశామని తెలిపారు. తదనంతరం పాఠశాల కరెస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులను ఇన్నోవేటివ్ గా తయారు చేయడానికి ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ని రెండుసార్లు నిర్వహిస్తామని, తమ పిల్లలకు సృజనాత్మకత అభివృద్ధి చెందడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో తాము ఎప్పుడు ముందుంటామని, లీడ్ కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశామని, అలాగే పాఠశాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు పిల్లలు తయారు చేసిన చార్టులు, మోడల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ఫౌండర్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, అకాడమిక్ కోర్డినేటర్ సుమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.