ఇక నుంచి ట్యాబుల ద్వారా విద్యా బోధన మండల విద్యాధికారి

*ఇక నుంచి ట్యాబుల ద్వారా విద్యా బోధన మండల విద్యాధికారి*

ప్రశ్న ఆయుధం మార్చి 3 :బాల్కొండ ఉన్నత పాఠశాలకు పిఎం శ్రీ కింద డిజిటల్ పాఠాలబోధనకు ట్యాబులు మంజూరు చేయడం జరిగిందనీ,వాటిని ఈ రోజు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పంపిణీ చేసారు

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం లో భాగంగా పీఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా పథకం కింద బాల్కొండ ఉన్నత పాఠశాలకు 25 ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక

ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికతను ఉపయోగించి విద్యార్థుల చదువులను ఉన్నతంగా కొనసాగించాలని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ బోధనను ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తున్నారు అలాగే

ఇప్పటికే ఎంపిక ఎంపికైన బాల్కొండ ఉన్నత పాఠశాలకు 25 ట్యాబులు (వీటి విలువ సుమారు 5. లక్షలు )అందించారు ఇప్పటికే బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దృశ్య బోధనా అమలవుతుంది మన -ఊరు మనబడి కింద రెండేళ్ల క్రితం ఎంపికైన బాల్కొండ ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టు ఫ్లాట్ ప్యానల్ ను ప్రభుత్వం సమకూర్చింది ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఉపయోగించుకొని తెరపై విద్యార్థులకు కళ్ళకు కట్టినట్టు పాఠాలను బాల్కొండ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్నారు ఈ అంశాలను నేరుగా చూసుకునేలాగా సాధన చేసేలా ఉండేందుకు విద్యార్థులకు వాటిని సమకూర్చున్నారు 8 ,9 , మరియు 10తరగతి విద్యార్థులకు ట్యాబుల ద్వారా పాఠాల గురించి సందేహాలను నివృత్తి చేయనున్నారని మండల విద్యాశాఖ తెలిపారు.

Join WhatsApp

Join Now