భారత సైనిక విభాగంలో అగ్నివీర్ గా చేరడానికి పురుష అభ్యర్థుల నుండి 2027 సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ ప్రకటించింది. ఈ నియామకాలు అగ్నిపథ్ పథకం కింద జరుగుతాయి.
యువజన సర్వీసుల శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ ప్రకటన జారీ చేయబడింది. భారత ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా, భారత సైన్యంలో అగ్నివీర్ గా చేరేందుకు అర్హులైన పురుషుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి.
ఈ నియామకాలకు సంబంధించి, వివాహం కాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01.07.2005 నుండి 01.07.2009 మధ్య జన్మించిన వారై ఉండాలి.
కామారెడ్డి జిల్లాలోని ఆసక్తి, అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 01.04.2026.
పూర్తి వివరాలను మరియు దరఖాస్తు విధానాన్ని (www.joinindianarmy.nic.in) అనే వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ ఈ సమాచారాన్ని ధృవీకరించారు.











