కామారెడ్డి జిల్లాలోని సరంపల్లి గిరిజన గురుకుల పాఠశాల, వరదల కారణంగా దెబ్బతిన్న కంప్యూటర్ ల్యాబ్‌ను పునరుద్ధరించడానికి గ్రీన్కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్లు అందజేశారు.
గత ఏడాది సంభవించిన భారీ వరదల్లో సరంపల్లి గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ పూర్తిగా నీట మునిగి విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడింది.
పాఠశాల ప్రిన్సిపల్ బి. అమర్ సింగ్ ఈ విషయాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు, గ్రీన్కో ఫౌండేషన్ ముందుకొచ్చి పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లను అందజేసింది. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ సమక్షంలో ఈ కంప్యూటర్లను పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు.
ఈ సహాయం ద్వారా విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి వీలు కలుగుతుంది. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు గ్రీన్కో ఫౌండేషన్, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.












