సంగారెడ్డి, జూలై 15
చిన్న కుటుంబం చింతలు లేనిదని, తక్కువ జనాభా ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని, పరిమిత సంతానం ఉన్న పిల్లలు సుఖశాంతులతో విద్యావంతులవుతారని రీజియన్ చైర్మన్ లయన్. జి.వెంకన్న అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో విజేతలకు ఆయన నగదు బహుమతులు అందజేశారు.
చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబమని, తక్కువ జనాభా కలిగిన దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని, పరిమిత సంతానం ఉన్న కుటుంబాల పిల్లలు సుఖశాంతులతో ఉంటూ విద్యావంతులవుతున్నారని రీజియన్ చైర్మన్ లయన్. జి.వెంకన్న అన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇస్మాయిల్ ఖాన్ పేట్ లో ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన జే.హరిత, యల్. సాన్వి, యం.డి.జోహలకు నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఉన్నత విలువలతో విద్యనభ్యశించాలని సూచించారు. పదవ తరగతి టాపర్స్ కు ఒక్కొక్కరికి 5వేల నగదును అందిస్తామని తెలిపారు. లయన్ సాంబ ప్రకాష్ (ప్రోగ్రామ్ చైర్మన్) దాతృత్వంతో ఈ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్తుగొండ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శంకరి విజయెందర్ రెడ్డి, రీజియన్ కార్యదర్శి యం.వెంకటేశం, డిస్ట్రిక్ట్ చైర్మన్ యన్. రామప్ప, సభ్యులు పి.శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


