పర్మిషన్ లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలను తనిఖీలు చేయాలి

పర్మిషన్ లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలను తనిఖీలు చేయాలి

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్

సిద్దిపేట డిసెంబర్ 8 ప్రశ్న ఆయుధం :

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో అనేక కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని వారన్నారు. వెంటనే స్థానిక విద్యాశాఖ అధికారులు పర్మిషన్లు లేకుంట నడుపుతున్న విద్యాసంస్థల్ని తనిఖీలు చేయాలని వారు కోరారు ఇలా విద్యాసంస్థలని పర్మిషన్లు లేకుండా నడిపితే అది రేపటి రోజున విద్యార్థులకి ఎంతో నష్టం అవుతుందని వారన్నారు. ఆ విద్యార్థి ఆ స్కూల్ వదిలి ఇంకో స్కూల్ కి వెళ్లాలంటే అక్కడ గవర్నమెంట్ సర్టిఫికెట్ గల బోన ఫైఢ్ మరియు టీసీ ఏ విధంగా ఇస్తారు. ఆ పర్మిషన్ లేని స్కూల్లో చదువుతున్న విద్యార్థులు చాలా నష్టపోతారని ప్రశ్నించారు. ఇలా వివిధ వివిధ రకాలుగా విద్యార్థులకి ఎంతో నష్టమవుతుందని వారు తెలిపారు వెంటనే స్థానిక ఆఫీసర్లు తనీఖీలు చేసి పర్మిషన్ లేకుండా నడుస్తున్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్ని సీజ్ చేయాలని వారు కోరారు లేని పక్షాన సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ గా తనిఖీలు చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now