మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్!కర్ణాటక సీఎం మార్పు వాయిదా!

మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్!కర్ణాటక సీఎం మార్పు వాయిదా!

IMG 20240828 WA0106

 

మహారాష్ట్ర ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి వనరుల కొరత ఉన్న నేపథ్యంలో కర్నాటక సిఎం మార్పు తాత్కాలికంగా వాయిదా పడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి..(కాంగ్రెస్ పాలనలో బలమైన ఆర్ధిక వనరులు తెలంగాణ,కర్ణాటక)నుంచి సేకరించాలి.కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంకి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు ఉండటం,తెలంగాణలో ఒక బ్యాంకు నుంచి 60కోట్లు బదిలీ చేయడం,వాల్మీకి కార్పోరేషన్ డెరైక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో కర్ణాటక నుంచి వ్యవహారం తెలంగాణకు చేరింది.కర్ణాటకలో సిఎంను మారిస్తే తెలంగాణలో ప్రభుత్వానికి నోటీసులు వస్తాయి, అప్పుడు అక్కడ సిఎంను మార్చాల్సి వస్తుంది అంటూ కర్ణాటక మంత్రి జార్జి హోలికి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు ఈ స్కాంకి,సంబందం ఉండటంతో కేవలం సిద్దరామయ్యను తప్పిస్తే ఇబ్బందులు తప్పవు అని కాంగ్రెస్ అధిష్ఠానం గ్రహించి సిద్దరామయ్యను కొనసాగించడానికి మొగ్గు చూపుతుంది.మహారాష్ట్ర ఎన్నికలకు ఆర్ధిక భారం తెలంగాణ,కర్నాటక రాష్ట్రాలు భరించాలి కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో పడింది..వరుస కుంభకోణాలు సిద్దరామయ్య మీద వచ్చిన సిఎంను మార్చలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉండటం. మూక్కి మూలిగి మూడు రాష్ట్రాలలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎంలను మార్చుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుంది కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది.సిఎం సిద్దరామయ్య క్యాబినెట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుటుంభానికి భూమి కేటాయించి,నిబంధనలు పాటించాను అని ప్రకటన చేసి జాతీయ నాయకత్వాన్ని డిఫెన్స్ లో పడేసి ప్రస్తుతానికి సీఎం పదవి కాపాడుకున్నారు..ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్ఠానం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మీద భూ ఆరోపణలు రావడం,రెండు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు వాల్మీకి కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాయి.ప్రస్తుతానికి సీఎంల మార్పు అనే అంశాన్ని అటకెక్కించినట్టే అంటూ కాంగ్రెస్ నాయకులు లీకులు ఇస్తున్నారు..

Join WhatsApp

Join Now