ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 5 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్కముల మైసయ్య యాదవ్.. తహశీల్దార్ కు విజ్ఞప్తి చేశారు. శివ్వంపేట నూతన తహశీల్దార్ కమలాద్రిని గురువారం రైతు రక్షణ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఆయనను శాలువాలతో సన్మానించారు. మండల వ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.