రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి –

 

విషయం: రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి – ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.

IMG 20241113 WA0094

ఏలూరు, నవంబర్ 13: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం సమస్యల పరిష్కారం, అభివృద్ధిని విస్మరించి ప్రజలను అవస్థలకు గురిచేసిందని ఎంపీ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు ఎంపీ తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు సి.ఎస్.ఆర్ నిధులు మంజూరు చేయాలని ఎన్ .టి .పి.సి చైర్మన్ ను ఇటీవల కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపే దిశగా తనవంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆర్జీదారులకు తెలియజేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో బయోగ్యాస్ కు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని, ఒక యూనిట్ రూ.130 కోట్లు నుంచి రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారని, తద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుకు దోహదం చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని ఎంపీ తెలిపారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, ఏలూరు పార్లమెంటును ఇండస్ట్రియల్ జోన్ గా తయారు చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు ఈ కార్యక్రమనికి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

Join Now