పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారిస్తున్న ఈడీ
హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాము కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణి జరిగింది. అయితే ఈ స్కీంలో రూ. 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారిస్తోంది. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును విచారిస్తున్నారు. గొర్రెల స్కాంలో దళారులు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్‌పై అధికారులు అరా తీస్తున్నారు. గొర్రెల స్కీం మొదలు పంపిణీ, యూనిట్ల సేకరణ వీటన్నిటిపై ఈడీ అధికారులు అరా తీస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిధుల చెల్లింపునకు సంబంధించిన వివరాలపై కూడా అధికారులు విచారిస్తున్నారు..