లారీని ఢీకొన్న బస్సు ఎనిమిది మంది కి తీవ్ర గాయాలు

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, సెప్టెంబర్ 25 (ప్రశ్న ఆయుధం):
మండలంలోని సుద్దపల్లి సమీపంలో జాతీయ రహదారి 44వ నంబర్‌పై గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి సమీపానికి రాగానే, డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న డిచ్‌పల్లి ఎస్‌ఐ షరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

Join WhatsApp

Join Now