సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏకలవ్య విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏకలవ్య వంటి మహానుభావుని జయంతి నిర్వహించడం గొప్ప విశయమని తెలిపారు. ఏకలవ్య త్యాగం, శ్రమ, శిష్య భావన అందరికీ ఆదర్శమని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరు ఏకలవ్య పట్టుదల, నిబద్ధతను అనుసరించాలని అన్నారు. యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య సంఘం అధ్యక్షుడు వినోద్, సురేందర్ రెడ్డి, నరసింగరావు, భాస్కర్ గౌడ్, సత్యనారాయణ దేవేందర్ రెడ్డి, సూర్యనారాయణ, వాసుదేవరెడ్డి,ఆంజనేయులు,చంద్రారెడ్డి, జైపాల్ రెడ్డి, యాదగిరి, సాయి యాదవ్, మురళి యాదవ్,వాసు యాదవ్, ఉపేందర్ రెడ్డి, భాను యాదవ్, ఏకలవ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Latest News
