దేశ సైనికులకు సంఘీభావంగా మన అందరి నినాదం ఒకటే ఏక్తా తిరంగ్.. ఎమ్మెల్యే అమిలినేని

*దేశ సైనికులకు సంఘీభావంగా మన అందరి నినాదం ఒకటే ఏక్తా తిరంగ్.. ఎమ్మెల్యే అమిలినేని*

*కళ్యాణదుర్గం పట్టణం ప్రజావేదిక నుంచి వేలాది మంది దేశభక్తులు జాతీయ పతాకాన్ని చెత్తపట్టుకుని పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ, అమరులైన జవానులకు జోహార్లు అర్పిస్తూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తో కలసి వాల్మీకి కూడలి వరకు ఎక్తా తిరంగ్ ర్యాలీ చేపట్టారు* ..ఈ సందర్బంగా *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ*

ఏప్రిల్ 22న పహాల్గామ్ లో ఉగ్రవాదులు చొరబడి మన దేశ పౌరులను విచక్షణా రహితంగా 26 మందిని కాల్చి చంపారు. అందులో భాగంగానే *మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ  ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడం జరిగిందని, మన సైనికులు చూపిన సాహసంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని, మన సైనికులు చూపిన తెగువ, ధైర్య సాహసాలతో పాకిస్థాన్ తోకముడిచిందని అందుకు మన సాయుదదలాలను గౌరవించేందుకు దేశవ్యాప్తంగా తిరంగ్ ర్యాలీలు చేపడుతున్నారని తెలిపారు. మన సైనికుడు కల్లితాండా వాసి మురళి నాయక్ కూడా ఇదే ఆపరేషన్ సిందూర్ లోనే వీరమరణం పొందాదని ఆయనకు మనందరం ఘనంగా నివాళులు అర్పించి ఆయన ధైర్య సాహసాలు యువతకు మార్గదర్శనం అవుతుందని తెలిపారు* ..

Join WhatsApp

Join Now