ఏల్లంపేట యువతి, రెండేళ్ల బిడ్డ కనిపించకపోవడంతో కలకలం

🔹ఏల్లంపేట యువతి, రెండేళ్ల బిడ్డ కనిపించకపోవడంతో కలకలం

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 14

మాచారెడ్డి మండలం ఏల్లంపేట గ్రామంలో తల్లి–బిడ్డ గల్లంతైన సంఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బుక్య రేణ, తన కూతురు అజ్మీర స్వర్ణ (24) మరియు రెండేళ్ల మనవడు అక్టోబర్ 4వ తేదీ నుండి కనిపించడం లేదని మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు. ప్రకారం, స్వర్ణ ఇంటి నుండి వెళ్లేముందు ఆకుపచ్చ చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉండగా, బిడ్డ పసుపు రంగు టీషర్ట్‌లో ఉన్నట్లు తెలిపారు. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు గల్లంతైన కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిసినట్లయితే మాచారెడ్డి ఎస్సై (87126 86151)కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment