సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 12 నుండి 19 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల ట్రాన్స్ జెండర్స్ శాఖ అధికారి లలితాకుమారి తెలిపారు. బుధవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సంగారెడ్డిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పోస్టర్స్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలలో సీనియర్ సిటిజన్స్ అందరూ పాల్గొనాలని, తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007, సీనియర్ సిటిజన్ కొరకు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ సంక్షేమ చట్టం గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని, అందరికీ తెలియజేయాలని కోరారు. సమాజంలో తల్లిదండ్రులు పిల్లల వలన ఎదుర్కొంటున్న సమస్యల కొరకు వృద్ధుల పోషణ మరియు సంరక్షణ కొరకు ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్𝟭𝟰𝟱𝟲𝟳 ఏర్పాటు చేయబడిందని, ఈ టోల్ ఫ్రీ నెంబరును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ సూర్యరావు, వయో వృద్ధుల, దివ్యాంగుల శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, వయోవృద్ధులు మరియు దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఉమేరా సహిష్ట, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు విజయ రావు, అశోక్ కుమార్, సంగయ్య, కృష్ణ, సత్తయ్య, నరసింహారెడ్డి, ఖాదర్ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 12 నుండి 19 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు: జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి
Published On: November 12, 2025 4:03 pm