మాదిగ ఉప కులాల జేఏసీ కమిటీ ఎన్నిక

మాదిగ ఉప కులాల జేఏసీ కమిటీ ఎన్నిక

జగదేవపూర్ జనవరి 11 ప్రశ్న ఆయుధం :

జగదేవపూర్ మండల మాదిగ ఉప కులాల జేఏసీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాదిగ ఉప కులాల జేఏసీ మండల అధ్యక్షులుగా మాస పాక యాదగిరి, ఉపాధ్యక్షులుగా రాజు, యాదగిరి, జంగని ఐలయ్య, తుప్ప నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం వెంకటేశం, కోశాధికారిగా నర్సింహులు, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం జేఏసీ మండల అధ్యక్షులు మాసపాక యాదగిరి మాట్లాడుతూ వేయి గొంతులు లక్ష డబ్బులు ఫిబ్రవరి 7 న ఏబిసిడి వర్గీకరణకు జరిగే మహోన్నతమైన కార్యక్రమానికి జగదేవపూర్ మండలం నుండి అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరూ డప్పు తోని హైదరాబాద్ కు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now