మెపా కొత్తగూడ మండల
కమిటీ ఎన్నిక
అద్యక్షులు గా అల్లాడి రాజు ముదిరాజ్
ప్రధాన కార్యదర్శి గా హంస వెంకట్ నారాయణ
ఉపాధ్యక్షుడిగా చొప్పరి కుమార్..
_ ముఖ్య అతిథి మెపా
వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్.
మహబూబాబాద్ : కొత్తగూడ మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు దుండి అశోక్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో MEPA మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ) వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై “మెపా” కొత్తగూడ మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా వేలుబెల్లి గ్రామానికి చెందిన అల్లాడి రాజు ముదిరాజ్ ను, ప్రధాన కార్యదర్శిగా పొగళ్లపల్లి గ్రామానికి చెందిన హంస వెంకట్ నారాయణ ముదిరాజ్ ను, ఉపాధ్యక్షులుగా చొప్పరి కుమార్ ముదిరాజులను ఏకగ్రీవంగా ఎంపిక చేసి రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది.అనంతరం మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ…ముదిరాజ్ ల హక్కుల కోసం మెపా కృషి చేస్తుందని,విద్య ఉద్యోగ సాధికారత కోసం మెపా ను స్థాపించమని ఇందులో ప్రతి ముదిరాజ్ భాగస్వామ్యం కావాలని అన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ..ఈ ఎన్నికకు సహకరించిన మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ కు,వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దుండి అశోక్, ప్రధాన కార్యదర్శి జెట్టి యాకయ్య ముదిరాజ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మండలంలో ప్రతి గ్రామంలో ముదిరాజ్ ల అభివృద్ధి , ఐక్యత కోసం కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మెపా నాయకులు బొల్ల బోయిన యాకాంబరం ,కొక్కు సంపత్, గుంటుక నరేష్,చాగంటి అశోక్, అర్వపల్లి వీరన్న
నారాయణ లతో పాటు ముదిరాజ్ కుల బందువులు పాల్గొన్నారు.