ఎల్లారెడ్డి మండల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నిక 

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 28, ఎల్లారెడ్డి :

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ సర్వసభ్య సమావేశం బుధవారం ఎల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెగావత్ కనిరామ్, జిల్లా ఉపాధ్యక్షులు జ్ఞానేశ్వర్ హాజరైనారు. ఈ సందర్భంగా కొంగల వెంకట్  మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యల కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని, సంఘ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం మండల నూతన కమిటీ అధ్యక్షులుగా మంత్రి వెంకటయ్య , ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రాథోడ్, కోశాధికారిగా ఎస్ సాయిలు, ఉపాధ్యక్షులుగా శివలింగం, నౌషా, సాయిలు, సంగియా, కార్యదర్శులుగా మాన్య ,శివరాములు, అనిత దేవి లను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు .

Join WhatsApp

Join Now