స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ సిద్దిపేట లో నిర్వహించినటువంటి ట్రస్మా పట్టణ శాఖా నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ మాజీ అధ్యక్షులు మోహన్ కుమార్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో నిర్వహించినటువంటి ట్రస్మా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ట్రస్మా డిస్టిక్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కమిటీ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వర్తించి ఆర్గనైజేషన్ ని చాలా బలంగా తయారు చేశారని గురుపూజోత్సవం కానీ హెల్త్ క్యాంప్ కానీ మొదలగు కార్యక్రమాలన్నీ చాలా దిగ్విజయంగా పూర్తి చేశారని అని కొనియాడారు. నూతన కమిటీ ఎన్నిక కొరకు ఎలక్షన్ అధికారులుగా విచ్ఛేసినటువంటి భాస్కర్ రెడ్డి మరియు రామాంజనేయులు మాట్లాడుతూ కొత్త కమిటీని ఎన్నుకోవడం కొరకు సభ్యులను ప్రతిపాదించాల్సిందిగా నామినేషన్స్ ని ఆహ్వానించారు. నామినేషన్స్ ని స్వీకరించిన ఎలక్షన్ అధికారులు ఎన్నికలను నిర్వహించి పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని. నూతన కమిటీ అధ్యక్షులుగా మోతుకు నరేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణారెడ్డి , కార్యదర్శిగా సుజాత , సహ కార్యదర్శిగా సెల్వ రాజు , కోశాధికారిగా చైతన్య రెడ్డి ఎన్నిక కాబడ్డారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సోమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త కమిటీకి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల్ని నిర్వహించి ఆర్గనైజేషన్ ని బలోపేతం చేయాలని పిలుపు నివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ అధ్యక్షులు మోతుకు నరేష్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో గల ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్య వచ్చినా సరే ముందుండి పరిష్కరిస్తానని, మీ వెంట నిలుస్తానని అందరి సహాయ సహకారాలతో సిద్దిపేట కమిటీని మరింత బలోపేతం చేస్తానని దానికి కావాల్సిన శక్తిని పరమేశ్వరుడు అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కుంట రాజు , మోహన్ కుమార్ , ప్రసాద్ , గోపి , రవి మరియు సిద్దిపేట ట్రస్మా సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.
ట్రస్మా సిద్దిపేట పట్టణ నూతన కమిటీ ఎన్నిక
