ఎస్పీ నగర్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక
ప్రశ్న ఆయుధం జనవరి 17: కూకట్‌పల్లి ప్రతినిధి
ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీ (SP) నగర్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా యువ నాయకుడు కార్తీక్ ఎన్నికైన సందర్భంగా, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది, ఎస్పీ నగర్ నూతన అధ్యక్షుడు కార్తీక్ ని వడ్డేపల్లి రాజేశ్వరరావు సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ యువత ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రాలైన సంక్షేమ సంఘాల్లో, రాజకీయాలలో కీలక పాత్ర వహించి దేశానికి సేవ చేయాలని, మీలాంటి యువకుడు సంక్షేమ సంఘాలకు సేవ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమని, ప్రజా సమస్యలను పరిష్కరించి కాలనీ అభివృద్ధికి మీకు అండగా ఉంటామని వడ్డేపల్లి రాజేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి యువ మోర్చా కన్వీనర్ ఈ.సాయి, యువ నాయకులు దినేష్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.