పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పీఆర్టియు సర్వ సాధారణ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు. నూతన మండల అధ్యక్షుడిగా బి.జగదీష్,ప్రధాన కార్యదర్శి కిశోర్, ఉపద్యక్షురాలిగా రజిని,కార్యదర్శిగా యాదు, సుందరసింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా బాద్యులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే విదంగా కృషి చేస్తామని అదేవిదంగా పది సవత్సరాల నుండి బదిలీలు లేక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను అర్థం చేసుకొని బదిలి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం చాలా సంతోష్ణగా ఉందని, ప్రభుత్వ బడుల్లో విదులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పాఠశాల బలోపేతం కొరకు కృషి చేయాలని అన్నారు. PRTU మండల నూతనంగ ఎన్నుకోబడ్డ కార్యవర్గాన్ని శాలువలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా బాద్యులు, మండల బాద్యులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.