సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలను నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు, (మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్) సిహెచ్. సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం ఆయన సంగారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలోజిల్లా ఎన్నికల అధికారి /జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు జి.రాకేష్ (మెదక్ జిల్లా ఆడిటింగ్ ఆఫీసర్లు, ఎన్నికల నోడల్ అధికారులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలు, అభ్యర్థుల వ్యయ పరిశీలన పర్యవేక్షణ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులందరూ కృషి చేయాలి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా ప్రభలోభాలకు లోను చేయకుండా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఎఫ్ఎస్ టి, టీం సభ్యులు అభ్యర్థుల వ్యయ పరిశీలన ప్రచార తీరుపై అభ్యర్థులు బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో డబ్బుల విత్ డ్రా పై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో సమర్పించిన ఖాతా నుండే ఎన్నికల ఖర్చులను పెట్టాలన్నారు. రూ :పదివేల కంటే లోపు నగదు రూపంలో ఖర్చు అన్నారు 10,000 పైగా వెచ్చించే మొత్తాన్ని చెక్కుల రూపంలో మాత్రమే ఖర్చు చేయాలని నామినేషన్ సమయంలో అందజేసిన ఖాతా నుండి ఈ డబ్బు ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల పర్యవేక్షణ టీంలకు అవసరమైన అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, డిప్యూటీ జడ్పీ సీఈఓ స్వప్న, డిపిఓ సాయిబాబా, ఈడి ఎస్ సి కార్పొరేషన్ రామాచారి, డీఈవో వెంకటేశ్వర్లు, సంబంధిత నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి: జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు సిహెచ్.సత్యనారాయణరెడ్డి
Oplus_131072