అన్నెల లక్ష్మణ్ , రవిబాబు రాష్ట్ర కార్యదర్శులు ధర్మ సమాజ్ పార్టీ
సిద్దిపేట సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, రైతు లందరికీ వెంటనే రూ. 2 లక్షల ఋణ మాపి పూర్తి చేయాలని, భారీ వర్షాల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ నివారణ చర్యలు తీసుకోవాలని, నిరాశ్రయులు అయిన వారికి నిత్యావసర సరకులు, పంట నష్ట పరిహారం ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి అన్నెల లక్ష్మణ్ మరియు మరో రాష్ట్ర కార్యదర్శి కర్రోల్ల రవిబాబు లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సదన్ మహరాజ్ లతో కలిసి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుల గణన పై హామిచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కుల గణన చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందని ఇది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధమని వెంటనే కుల గణన చేపట్టాలని తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అదేవిధంగా గత 10 సంత్సరాల నుండి గత ప్రభుత్వం రేషన్ కార్డ్స్ అందరికి ఇవ్వకపోవడం వలన ప్రతి కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగింది. ఒకరి కంటే ఎక్కువ సభ్యుల పై లోన్స్ ఉన్నాయి రేషన్ కార్డు లింక్ పెట్టడం వలన చాల మంది రైతులకు రైతు రుణ మాఫీ కాలేదు కనుక రేషన్ లింక్ తీసివేసి అందరికీ రుణ మాఫీ అందేలా చేయగలరు.
2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్న వారికి 2 లక్షల పైన ఉన్న వాటిని వ్యవసాయ అధికారులు కట్టమని అంటున్నారు అదీ కాకుండా ప్రభుత్వం చెప్పినట్టు 2 లక్షలు రైతు రుణ మాఫీ రైతుల అకౌంట్ లో వేయాలని ఎక్కువ ఉన్న డబ్బులు రైతుల మీద అప్పు ఉంటుంది వారు ఋణం రెన్యూవల్ చేసుకుంటారు.
రుణ మాఫీ అయిన రైతులందరికీ తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జ్యోతి, జిల్లా నాయకులు డి.బి. రాజు చందు, ప్రసన్న, సతీష్, సురేష్, కనక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.