ఈనెల 10న విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక
– కామారెడ్డి ఈనెల 10న విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ను మాచారడ్డి మండలంలోని చుక్క పూర్ గ్రామ శివారులో గల 3/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో, విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు, కామారెడ్డి రూరల్ ఏ డి ఈ, నరేష్, మాచారెడ్డి ఏఈ తిరుపతి రెడ్డి
లు ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. ఈ పరిష్కార వేదికలో విద్యుత్ వినియోగదారుల, రైతులు, కన్జ్యూమర్ల, సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ప్రకటనలో వారు పేర్కొన్నారు. పరిష్కార వేదిక కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా నుండి ముఖ్య అతిథులుగా టీజీఎన్ పిడిసిఎల్ చైర్మన్ ఏరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ నెంబర్ లకావత్ కిషన్, ఫోర్త్ నెంబర్ మర్రిపల్లి రాజ గౌడ్ లు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పరిష్కార వేదికలో మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి, సదాశివనగర్, మండలాలకు చెందిన రైతులు, వినియోగదారులు, తమ సమస్యలను, పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా, రైతులను, విద్యుత్ వినియోగదారులకు, విజ్ఞప్తి చేశారు.