మార్చి 31 నుంచి యాదాద్రి థర్మల్ పవర్ లో విద్యుత్ ఉత్పత్తి..
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉమ్మడి నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి ధర్మ పవర్ స్టేషన్లో వచ్చే మార్చి 31 అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఆయన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్లో ఆయిల్ సిక్రానైజేషన్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ చివరినాటికి మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి అన్ని స్టేజీలలో యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూములు కోల్పోయిన వారికి తక్షణమే వారి కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్లు బోనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రి ధర్మాలు పవర్ స్టేషన్ నాలుగు సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ ప్రాజెక్టును త్వరతగతిన పూర్తిచేయాలని తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనులు చేపడుతుందన్నారు కార్యక్రమంలో రాష్ట్ర టీజీ జెన్కో ఎండి రోనాల్డ్ రోస్, మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎస్ పి శరత్ పవర్ ,అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానంద, చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.