*విద్యుత్ అధికారులు రైతులతో కలిసి తో పొలం బాట*
*జమ్మికుంట జనవరి 27 ప్రశ్న ఆయుధం*
సోమవారం రోజున వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో రైతులతో కలిసి విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి ఈ ఉపేందర్ టెక్నికల్ ఇంజనీర్ సిహెచ్ రాజేందర్ ఏ డి ఈ జమ్మికుంట పి శ్రీనివాస్ ఏ ఈ చల్లూర్ పాల్గొని రైతులు బావుల వద్ద జరిగే విద్యుత్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు విద్యుత్ మోటార్లకు బిగించే కెపాసిటర్ల వాడకం వలన వచ్చే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించి ఆటోమేటిక్ స్టార్టర్లు బిగించడం వల్ల ఏర్పడే అనర్థాల గురించి క్లుప్తంగా వివరించి రైతులు అందరూ కెపాసిటీలు బిగించుకొని సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని సంబంధిత విద్యుత్ అధికారులు రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు అనంతరం విద్యుత్ అధికారులకు రైతులు ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరచాలని కోరారు అందుబాటులో ఉన్న లైన్ ఇన్స్పెక్టర్ లైన్మెన్ లకు సమస్యలను వివరించాలని కోరారు