నూతన సంవత్సర వేడుకలకు ముందస్తు అనుమతి తప్పని సరి ….   ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ శాఖీర్ అహ్మద్ 

నూతన సంవత్సర వేడుకలకు ముందస్తు అనుమతి తప్పని సరి ….

ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ శాఖీర్ అహ్మద్

ఎల్లారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలను, ఫంక్షన్ హాల్లో నిర్వహించేందు కోసం ముందస్తుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పని సరి అని ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ శాఖీర్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ…ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ దిఫ్యూటి కమిషనర్ వి.సోమిరెడ్డి, కామారెడ్డి జిల్లా ఎక్సైజ్. సూపరింటెండెంట్ బి.హన్మంతు రావు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈవెంట్స్ కోసం ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోటల్స్, ధాబాల్లో సిట్టింగ్ లకు అనుమతి లేదని, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకు వచ్చిన,తరలించిన అట్టి మధ్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, తీసుకు వచ్చిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతోందని ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now