అయ్యప్ప స్వాములపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కక్ష సాధింపు చర్య.
– గతంలోనే ప్రతి చోటా కమిషన్లు అడుగుతున్నాడని మదన్మోహన్ రావు పై అనేక ప్రచారాలు….?
– కక్ష సాధింపుతో ఆలయానికి, అయ్యప్ప స్వాములు ఉంటున్నటువంటి సన్నిధానానికి రాత్రి 11 గంటల నుండి విద్యుత్ నిలిపివేత..
– ఇదంతా రాజకీయనాయకులమధ్యలో అయ్యప్ప స్వాములకు ఇబ్బంది పెట్టడం వెనుకాల ఎవరి హస్తం ఉంది అంటున్న భక్తులు …?
ఇదంతా ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందా..? లేదా పిఏలు చేపిస్తున్నారా..? అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…?
అర్ధరాత్రి రోడ్డెక్కిన అయ్యప్పలు
– దీంతో హువాగానాలు నిజమే అంటున్న ప్రజలు…!
ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా తమ సమస్యగా భావించి తీర్చే నాయకుడిని ప్రజానాయకుడు అంటారు. కానీ తనకు కమిషన్ ఇవ్వకుండా, మామూలు ముట్ట చెప్పకుండా ఏ పని చేయకూడదు అని అంటే అతనినీ వ్యాపారి అనే అంటారు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రజా ప్రతినిధి కాదు వ్యాపారే అని ఆ నియోజకవర్గ ప్రజలు గతం నుండి పేర్కొంటున్నారు. అయినప్పటికీ గతంలో అతని పేరు బయటకు రాలేదు ప్రస్తుతం అయ్యప్ప స్వాములను గెలకడంతో పూర్తి విషయాలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే
నెలలో అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులను, ( అధికార, ప్రతిపక్ష ) దాతలను ఆలయ నిర్మాణంలో సహకారం అందించిన పెద్దలను కలిసి ఆహ్వాన పత్రాలను ఇవ్వడంపై ఆ ఎమ్మెల్యేకు ఆగ్రహం వచ్చింది. తన అనుమతి లేకుండా అందరికి ఎలా ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు అంటూ స్వాములపై మండిపడ్డ ఎమ్మెల్యే ,అసలు ఎమ్మెల్యే ఇండియాలోనే లేకపోవడం అమెరికాలో ఉంటూ ఇక్కడ స్వాములను నాకెందుకు ఆహ్వాన పత్రిక ఇవ్వలేరు అని స్వాములను కించపరుస్తూ స్వాములని ఇబ్బంది పెడుతు అంతటితో కాకుండా అతని పీఏతో రాత్రి 11 గంటలకు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి అయ్యప్ప స్వాములకు విద్యుత్ నిలిపివేశాడు. విషయం తెలుసుకున్న అయ్యప్పలు అర్ధరాత్రి కామారెడ్డి హైవే పైన పెద్ద ఎత్తున స్వాముల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంకేముంది అయ్యగారి బండారం అంతా బయటపడ్డది. తమకు
ఇలాంటి సిగ్గుమాలిన ఎమ్మెల్యే ప్రవర్తనతో ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు సిగ్గుపడుతున్నమని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.