సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసిన ఎల్లయ్యగారి అనిల్ కుమార్..
నాలుగవసారి రక్తదానం
-ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో కనకవ్వ (40) ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తనిధి లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో పరిదీపెట్ గ్రామానికి చెందిన ఎల్లయ్యగారి అనిల్ కుమార్ సహకారంతో సకాలంలో రక్తాన్ని కేబీసీ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి రక్తదాత అనిల్ కుమార్ ముందుకు రావడం జరిగిందని,రక్తదాతకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న ల తరఫున అభినందనలు తెలియజేశారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి పంపించాలని అన్నారు.
సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసిన ఎల్లయ్యగారి అనిల్ కుమార్..
by kana bai
Published On: November 13, 2024 10:22 pm