ఎల్లారెడ్డి అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ ప్రారంభం

ఎల్లారెడ్డి అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ ప్రారంభం

 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 15 (ప్రశ్న ఆయుధం):

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పోషణ, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా “పోషణ భీ – పడాయి భీ” కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 251 మంది అంగన్వాడీ టీచర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, టీచర్లను మూడు బ్యాచ్‌లుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం – పిల్లలకు పౌష్టిక ఆహారం ప్రాముఖ్యతను అర్థం చేయించడం, అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నాణ్యతను పెంపొందించడమే.

కార్యక్రమంలో సీడీపీఓ స్వరూప రాణి, సూపర్వైజర్లు భారతి, హారతి, వినోదిని, బ్లాక్ కోఆర్డినేటర్ కళ్యాణి పాల్గొని టీచర్లకు శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో భాగంగా ప్రాక్టికల్ సెషన్లు, గ్రూప్ చర్చలు, మోడల్ యాక్టివిటీలతో టీచర్లకు పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐసిడిఎస్ అధికారులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now