Site icon PRASHNA AYUDHAM

ఎల్లారెడ్డి ఆర్డీవో పర్యటన – తండాల్లో ఇండ్లు, మొక్కలు పరిశీలన

IMG 20250801 WA0644

ఎల్లారెడ్డి ఆర్డీవో పర్యటన – తండాల్లో ఇండ్లు, మొక్కలు పరిశీలన

గాంధారి మండలంలోని గండివెట్ తండా, హేమ్లా నాయక్ తండా, మడుగు తండా గ్రామాల్లో పర్యటన

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన, డ్రై డే – ఫ్రై డే కార్యక్రమంపై సమీక్ష

మడుగు తండాలో వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు

అటవీశాఖ, పంచాయతీ సిబ్బంది, ఎంపిడీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు

అధికారులు గ్రామాల్లో తాగునీరు, వసతి అంశాలపై స్థానికులతో చర్చలు

కామారెడ్డి జిల్లా గాంధారి..(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 01

ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసారథి శుక్రవారం గాంధారి మండలంలోని పలు తండాల పర్యటనలో పాల్గొన్నారు. ముందుగా గండివెట్ తండాలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, అక్కడ జరుగుతున్న డ్రై డే – ఫ్రై డే కార్యక్రమాన్ని సమీక్షించారు.తర్వాత హేమ్లా నాయక్ తండా, మడుగు తండాలో కూడా ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆర్డీవో, మడుగు తండా ప్రాథమిక పాఠశాలలో వనమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్, అటవీశాఖ అధికారి హిమచందన, పంచాయతీ కార్యదర్శులు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కలసిపని చేయాలని అధికారులను ఆర్డీవో ఆదేశించారు.

Exit mobile version