Headlines :
-
డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
-
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రి పెండింగ్ బిల్స్ పై వినతి
-
మోతే గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
-
డిప్యూటీ సీఎం స్పందన: మదన్ మోహన్ వివరాలు
-
ఎల్లారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రి కు ఆర్థిక సాయం అవసరం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి
విక్రమార్కని ఎమ్మెల్యే మదన్ మోహన్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పెండింగ్ బిల్స్ను త్వరగా విడుదల చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతూ వినతి పత్రం అందచేశారు. అలాగే మోతే గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సిద్ధం చేశామని తెలిపారు. డిప్యూటీ సీఎం ఈ విషయాలకు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.