ఎల్లారెడ్డి త్రిశూల్ వైన్స్ లో చోరీ – రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

ఎల్లారెడ్డి, అక్టోబర్13, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి పట్టణంలోని త్రిశూల్ వైన్‌ షాప్‌లో ఆదివారం అర్ధరాత్రి చోరీ సంభవించింది. గుర్తు తెలియని దొంగలు షాప్ వెనుక భాగంలోని గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించి, క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.15,000 నగదు అపహరించినట్లు ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్‌లను సేకరించారు. దొంగల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment