Site icon PRASHNA AYUDHAM

గ్రామ అభివృద్ధికి పాటుపడాలి – ఏమైల్య ప్రశాంత్ రెడ్డి*

Screenshot 20251222 203040 1

*గ్రామ అభివృద్ధికి పాటుపడాలి – ఏమైల్య ప్రశాంత్ రెడ్డి*

 

ఆర్మూర్,డిసెంబర్,22

(ప్రశ్న ఆయుధం) ఆర్ సి

మేజర్ గ్రామపంచాయతీ బాల్కొండ కార్యవర్గం గ్రామ అభివృద్ధికి పాటుపడాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.సోమవారం రోజు బాల్కొండ నియోజకవర్గం కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ పాలక మండలి పదవి స్వీకారం

అనంతరం గ్రామపంచాయతీ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సభ్యులు ఎంపిక కాకముందు ఎలా ఉండేవారో ఎంపికైన తర్వాత కూడా అలాగే ఉండాలని ఎంపికైన గ్రామ పంచాయతీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.బాల్కొండ లో రోడ్లు, మురికి కాలువలు,విద్యుత్ సౌకర్యాలు గురించి ఎక్కువ పట్టించుకో వాలని, ఆయా వార్డుల్లోని ప్రజలు కష్టల్లో ఉన్నపుడు తోడుగా ఉండాలని కోరినారు.పైగా జి. పి ఎన్నికల్లో గెలుపొందిన వారందరు ఐక్యంగా ఉండాలి ఇది ఇలా ఉండగా బాల్కొండ ఉపసర్పంచ్ పదవిని 17 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగ గాండ్ల రాజేందర్ ను ఎన్నీకొవడం విశేషం. ఈ కార్య క్రమంలో ఎస్. ఐ సైలెందర్, మాట్లాడుతూ గ్రామంలో యువకులు ఎక్కువగా ఉన్నారని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17 సభ్యుల్లో 12 మంది యువకులు వార్డు సభ్యులుగా ఎన్నిక రావడం విశేషమని గ్రామ సమస్యల పట్ల ఆయావార్డుల సమస్యలు తీర్చుకోవాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన సర్పంచ్ గా ఎన్నికైన గాండ్ల రాజేష్ సభను ఉద్దేశిస్తూ తనను సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి ప్రజల ఓట్లతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ అభివృద్ధికి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా ప్రజానీకానికి హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ తనను ఏకిగ్రీవంగా ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు 17 మంది వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల్ అభివృద్ధి అధికారి విజయందర్ రెడ్డి,గ్రామ పంచా యతీ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, ప్రభాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ,

బాల్కొండ ఆమ్ సంగం తో పాటు అన్ని కులాల అధ్యక్షులు కార్యదర్శులు నూతన సర్పంచిగా ఎన్నికైన గాండ్ల రాజేష్ ను సన్మానించారు.

Exit mobile version