Site icon PRASHNA AYUDHAM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీని ఆదరించండి

IMG 20250207 WA03871

స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీని ఆదరించండి

-సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించి పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా అవకాశం ఉన్నచోట్ల సర్పంచ్ స్థానాల్లో, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల్లో సిపిఎం పోటీ ఉంటుందని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం ను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పేద, మధ్యతరగతి ప్రజలకు , కార్మికులకు, రైతు కూలీలకు రైతులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని అనేక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోతిరం నాయక్ , కొత్త నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు ముదం అరుణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version