*నిరుద్యోగ సమస్యలు తీరుస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించండి*
*
*గ్రంథాలయ చైర్మన్ ఎండి రియాజ్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి*
*జమ్మికుంట ఫిబ్రవరి 20 ప్రశ్న ఆయుధం*
పట్టభద్రుల ఎమ్మెల్సీ కరీంనగర్ నిజాంబాద్ మెదక్ అదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి గెలిపించాలని పట్టభద్రులను రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ ఎండి రియాజ్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు గ్రంథాలయాల చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలను తీర్చుటకు ప్రజా ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నదని ప్రైవేటు టీచర్లు నిరుద్యోగ యువత సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసని వాటి పరిష్కారం మార్గాన్ని అన్వేషిస్తున్నారని ఒక్కొక్కటిగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వాన్ని పట్టభద్రులు విజ్ఞులు గ్రహించి ఆదరించాలని కోరారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు మొదటగా మాట్లాడిన చాడ వెంకటరెడ్డి పట్టభద్రులు ప్రైవేటు టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం ప్రభుత్వంలో భాగస్వామ్యులమైన మేము జరుగుతుందని వారు ఒకొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని ప్రైవేటు అధ్యాపకులు టీచర్ల హెల్త్ కార్డుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కారాన్ని చూపిస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు వెలువడుతాయని కాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తుందని ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నామని అదే తరుణంలో నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డి కి మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మర్రి వెంకటస్వామి శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు