పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు ఎంబ్రాయిడరీ మిషన్ అందజేత  

పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు ఎంబ్రాయిడరీ మిషన్ అందజేత

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 8

 

 

రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి సహకారం తో పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ కు ఎంబ్రాయిడరీ మిషన్ అందజేత.

 

రోటరీ క్లబ్ అఫ్ కామారెడ్డి, సాహకారం తో పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు శుక్రవారం రోజున గర్గుల్ గ్రామంలో 3,80,000 విలువ గల ఎంబ్రాయిడరీ మిషన్, సబ్సిడీతో 50000 విలువ కలిగిన రైతులకు తాటిపత్రులని అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే ఎంబ్రాయిడరీ మిషన్, ను అందించిన రోటరీ క్లబ్ మరియు పీపుల్ ఫర్ ఇండియా, వారిని అభినందించారు. గవర్నమెంట్ ఎల్లవేళలా మహిళలకు సహకారాన్ని అందిస్తున్నదని తెలియజేశారు.

విశిష్ట అతిథి డిడబ్లుఓ ప్రమీల మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని తెలియజేశారు.

రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కుట్టు మిషన్స్,విద్యార్థులకు ట్యాబ్స్, ఉచిత వైద్య పరీక్షలు వీటితో పాటు రైతులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను చేయడానికి రోటరీ క్లబ్ ముందుంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు శంకర్ సెక్రెటరీ సబ్బని కృష్ణ హరి, ప్రోగ్రామ్ చైర్మన్ రాజనర్సింహారెడ్డి ,ట్రెజరర్ రమణ కుమార్ పిఫ్ఐ మెంబర్ అరవింద్ ఎంఈఓ యోసేఫ్, రోటరీ మెంబర్స్ శ్రీశైలం, సుధాకర్, నవీన్ కుమార్ రైతులు భూమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment