రాజ్యాంగ దినోత్సవం. . వ్యాసకర్త ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్. .                 

*రాజ్యాంగ దినోత్సవం*. . వ్యాసకర్త ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్. .

26 నవంబర్ 1949 రాజ్యాంగం ఆమోదించిన రోజు ప్రజల భాగస్వామ్యంతో సమన్వయంతో నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రాజ్యాంగం మన దేశ ప్రజలందరికీ రాజ్యాంగ పీఠిక సంక్షిప్తంగా స్పష్టం చేస్తుంది. రాజ్యాంగం యొక్క సారాంశాని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యచెప్తుంది.ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సమాన అవకాశాలు కల్పించాలని సూచించింది. కుల మత భాష ప్రాంతీయ సాంస్కృతిగా భిన్నత్వంలో ప్రజలందరూ సమానమే అనిసూచించింది.ప్రజలు రాజ్యాంగాన్ని జాతీయ గీతాన్ని జాతీయ జెండాని గౌరవించాలని తెలుపుతూ కులము మతము లింగము వర్ణ భేదము లేకుండా అందర్నీ గౌరవించాలనిసూచించింది.ప్రభుత్వం అనుసరించాల్సిన ఆదేశ సూత్రాలను ప్రకటించి దాని కృషి చేయాలని సూచించింది. ప్రజలందరికీ రాజకీయంగా ఆర్థికంగా సామాజిక న్యాయం కల్పించి సహజ వనరులు సంపద ఏ ఒక్కరి సొత్తు కాదని దానిని దేశ సంపదగా గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉంచాలనిచెప్పింది. ప్రాథమిక సూత్రాలు హక్కులు విధులు తో పాటు ఓటు హక్కును కల్పించింది. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలని ప్రజలే ప్రభుత్వమని ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన కొరకు పని చేయాలని తెలిపింది. విద్య వైద్యం ఉపాధి అవకాశాలు వివక్ష లేకుండా ప్రజలు స్వతంత్రంగా జీవించే విధంగా పాలన సాగించాలని ప్రజలందరూ హక్కుదారులని చైతన్యం ద్వారా వ్యవస్థలు కొనసాగించాలని సూచించింది. సహజ వనరులు సంపద ఏ ఒక్కరి సొత్తు కాదని అది దేశ సంపదగా గుర్తించి ప్రజలందరికీ అందుబాటులో విధంగా చూడాలని తెలిపింది. సంపద కేంద్రీకృతం కాకుండా పన్నులతో ప్రభుత్వాన్ని పాలనను కొనసాగించాలని తెలియజేసింది. కీలకమైన ప్రాథమిక హక్కులను కల్పించింది. స్వేచ్ఛ సమానత్వం లక్ష్యంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. బావ ప్రకటన స్వేచ్ఛ స్వతంత్ర జీవనం పత్రికా స్వేచ్ఛ తోపాటు నివాస వసతి సేవలు న్యాయము స్వతంత్రంగా పొందే హక్కు ప్రతి పౌరుడు కి కల్పించబడ్డది.” రాజ్యాంగ పీఠిక…… ప్రజలందరికీ ఆర్థిక రాజకీయ మత స్వేచ్ఛ సాంస్కృతిక లింగ బేధం వర్ణభేదం భాషా బేధం కుల వర్ణ వ్యవస్థ లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా భిన్నత్వంలో ఏకత్వం కలిగి సామాజిక న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలని రాజ్యాంగ పీఠికలో సంక్షిప్తంగా పొందుపరిచారు. ” నేటి సమాజంలో పౌరుడు ప్రభుత్వాలు కేవలం ఓటరుగానే పరిగణించబడుతున్నది. అందుకు గాను అనేక సంక్షేమ పథకాలను ఓటర్కు ఏరా చూపుతున్నది. తద్వారా ప్రభుత్వా నిర్మాణానికి అధికారం చేపట్టడానికి తన వైపు తిప్పుకుంటున్నది. అభివృద్ధి సంక్షేమం అనే నిరంతర ప్రక్రియని పథకాల ద్వారా ప్రభుత్వాలపైన ఆధారపడే విధంగా ఎర్ర చూపుతున్నది. అభివృద్ధి సంక్షేమం లో ప్రజలు భాగస్వాములు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాజకీయ లో వ్యాపారులు భాగస్వాములు కావడం చేత ఓటర్ గా మాత్రమే మిగిలిపోతున్నారు. ప్రజలకు ఉచితాలు పథకాలు సంక్షేమం పేరా ఓటర్లను తమ వైపు తిప్పుకొని అధికారాన్ని దక్కించుకుంటున్నారు.రాజకీయంగా కులాలు మతాలు వర్గాలు పేరుతో ప్రజాస్వామ్య నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను ప్రజలకి ద్రాక్షగా మిగిలిపోతుంన్నది. రాజ్యాంగ కల్పించిన ఆదేశాలకు హక్కులకు పాలన కొనసాగుతున్నట్లు అనేక సందర్భాలలో ఆగుపడుతుంది. ప్రజలని ప్రలోభాలకు గురి చేస్తున్న పద్ధతి ఎన్నికల పోటీ Zero కనిపిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరిచి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి. పథకాలకు ఎరచూపి ప్రజలని ఓటర్లను తన వైపు తిప్పుకునే విధానానికి చరమగీతం పాడాలి. స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన నేటికీ ఆకలి చావులు అన్నదాత ఆత్మహత్యలు కులం వర్గం వర్ణము లింగము ప్రాంతీయ భేదాలు సమాజంలో అనేక అసమానతలు కొరవడం మనం నేటికి చూస్తూనే ఉన్నాం. వారసత్వ పోకడలు సమాజంలో కనిపిస్తున్నాయి.

రాజ్యాంగం ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఆ లక్ష్యం నేటికీ నెరవేరలేదని చెప్పక తప్పదు. అభివృద్ధి అంటే అన్ని రంగాలలో విద్యా వైద్యము న్యాయము శాస్త్ర సాంకేతిక ఆధునిక టెక్నాలజీ తో పాటు పేదరిక నిర్మూలన సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా వ్యవస్థలు ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగం యొక్క లక్ష్యం సౌబ్రతత్వం ఇక వాదం ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా నిర్మించబడింది. అందుగ్గాని ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రాజ్యాంగంలో భారత ప్రజలైన మేము రాజ్యాంగాన్ని నిర్మించుకొని భారత ప్రజలైన మేము మనకు మనమే సమర్పించుకున్నట్టు అన్న వాక్యముతో ముగుస్తుంది. రాజ్యాంగానికి దేశ ప్రజలే హక్కుల హక్కుదారులని దాన్ని హక్కులను పొందుతూ కాపాడుకుంటూ దాని అమలుపరచుకుంటూ దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలందరికీ పై ఉంది. అందుకు గాని ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతాయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment