*సమస్యలు పరిష్కరించని ఎమ్మార్వో మాకు వద్దు…*

*సమస్యలు పరిష్కరించని ఎమ్మార్వో మాకు వద్దు…*

 

*తాడ్వాయి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు..*

 

 

*తాడ్వాయి ఎమ్మార్వో మాకొద్దు రోడ్డెక్కిన రైతన్నలు*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 28

 

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని సమస్యలు పరిష్కరించండి. ఈ ఎమ్మార్వో మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ రైతులు రోడ్డెక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తాడ్వాయి మండల కేంద్రంలో రైతులకు సంబంధించిన ఇనాం భూముల సమస్యపై 20 ఎకరాల భూమిని కుల వృత్తుల రైతులకు పట్టాలు చేయాల్సి ఉంది.దానికి సంబంధించి మండల రెవెన్యూ అధికారికి పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని దీంతో విసుగు చెందిన కులాల రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది.పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఎటువంటి సమాధానం లేకపోవడంతో పట్టాలు కూడా చేయకపోగా ఆఫీస్ చుట్టూ తిరిగి ఇబ్బందులకు గురి చేసినందుకు కారణంగా సోమవారం రోజు సహనం నశించి రెవెన్యూ అధికారికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించడం జరిగిందని తెలిపారు.సమస్య ఉద్రిక్తం కావడంతో మండల రెవెన్యూ అధికారి ఎమ్మార్వో రోడ్డుపై బైఠాయించిన రైతులకు సమస్య పరిష్కారం దిశగా హామీ ఇవ్వడంతో రైతుల ధర్నా విరమించడం జరిగింది.ధర్నాకు మద్దతుగా బిజెపి,బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.

Join WhatsApp

Join Now