గాంధారి మండలంలో ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం

గాంధారి మండలంలో ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం

గాంధారి మండలంలో ఉపాధి హామీ కింద పనుల జాతర కార్యక్రమాలు ప్రారంభం

మండల ప్రత్యేక అధికారి మురళి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పనులు ప్రారంభం

పోతంగల్ ఖుర్దు గ్రామంలో హార్టికల్చర్ లో భాగంగా మునగ మొక్కలు నాటకం

గండివేట్ గ్రామంలో సోక్‌పిట్ పనులకు భూమి పూజ, ముధోలి లో మేకల షేడ్ పనులు మొదలు

ఎంపిడిఓ కార్యాలయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పనులు ప్రారంభం

కామారెడ్డి జిల్లా, గాంధారి, ఆగస్టు 22 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనుల జాతర కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల ప్రత్యేక అధికారి మురళి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. పోతంగల్ ఖుర్దు గ్రామంలో హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో మునగ మొక్కలు నాటారు. గండివేట్ గ్రామంలో సోక్‌పిట్ పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్ భూమి పూజ చేశారు. ముధోలి గ్రామంలో మేకల షేడ్ పనులు మొదలయ్యాయి. ఎంపిడిఓ కార్యాలయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పనులు కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాజేశ్వర్, ఉపాధి హామీ ఏపీవో మధు, గ్రామాల కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment