కేంద్రం కంట్రోల్‌లో ‘ఉపాధి’

*కేంద్రం కంట్రోల్‌లో ‘ఉపాధి’*

*రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం*

*ఉపాధి హామీ పథకం కింద ఏ పనికి బిల్లుల చెల్లింపైనా నేరుగా కేంద్రం నుంచే*

*ఇప్పటిదాకా కూలీలకు మాత్రమే నేరుగా వేతనాలు చెల్లిస్తున్న కేంద్రం*

మెటీరియల్‌ కేటగిరీ నిధులు రాష్ట్రాల ద్వారానే చెల్లింపు

ఇకపై అన్నీ కేంద్రం ద్వారానే.. ఏడు రాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

రాష్ట్రాల వాటా డబ్బులు ఎప్పటికప్పుడు ఉమ్మడి ఖాతాల్లో జమ చేయాల్సిందే

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలును ఇకపై పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు జరిగినా వాటికి సంబంధించిన అన్ని రకాల చెల్లింపులను నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులకు, సంస్థలకు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలుత ఏడు రాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విధానం అమలులోకి వస్తే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఇక రాష్ట్రాల పాత్ర నామమాత్రం కానుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం పథకం అమలుకు రాష్ట్రాలు చేసే ఖర్చులో కనీసం 60 శాతం (ఏడాదిలో రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే అందులో కనీసం రూ.60 కోట్లు) కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు వ్యయం చేయాల్సి ఉంటుంది.

ఉపాధి హామీ కింద రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులను ఎప్పుటికప్పుడు ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతనాలు, మెటీరియల్‌ నిధులను రెండు వేర్వేరు కేటగిరీలుగా వర్గీకరించి 2006లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

*మెటీరియల్‌ కేటగిరీ నిధులు కూడా* …

ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించడంతోపాటు పలుచోట్ల అవినీతి చోటు చేసుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏడేళ్ల కిందట 2017-18లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వారి బ్యాంకు ఖాతాలకు కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని అమలులోకి తెచ్చింది.

రాష్ట్రాల వారీగా కూలీల ద్వారా జరిగిన పనులకు అయ్యే మొత్తంలో గరిష్టంగా 40 శాతం మెటీరియల్‌ నిధులను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తూ వస్తోంది. ఆయా నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఇక మీదట మెటీరియల్‌ కేటగిరీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని తీసుకురానుంది.

*ఈ ఆర్థిక సంవత్సరం నుంచే*

Join WhatsApp

Join Now