✒️రేపటి వరకే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయ సేవలు
పోలీస్ శాఖలో ఎన్కౌంటర్లకు మారుపేరుగా నిలిచారు ముంబై పోలీస్ అధికారి దయా నాయక్. ‘నాపేరు దయ.. నాకు లేనిదే అది’ అనే డైలాగ్ ఈయనను చూసి పెట్టారేమో అనిపించేలా 80 మంది గ్యాంగ్ స్టర్లను హతం చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ గ్యాంగ్లకు సైతం తూటాలతో బదులిచ్చారు. రేపు ఈ సూపర్ కాప్ రిటైర్మెంట్ కాబోతుండగా పోలీసు శాఖలో ఆయన చేసిన సేవలకు నిన్న ACPగా ప్రమోషన్ రావడం విశేషం.£