జిన్నింగ్ మిల్లర్ల నిరవధిక బంద్ విరమణ

జిన్నింగ్ మిల్లర్ల నిరవధిక బంద్ విరమణ

— రేపటి నుండి పత్తి కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావచ్చు: జిల్లా కలెక్టర్

కామారెడ్డి,జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18

జిల్లాలో పత్తి కొనుగోలు సమస్యల పరిష్కారానికి మంగళవారం కీలక సమావేశం జరిగింది. సీసీఐ సీఎండీ, మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి వారి సమస్యలు విని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మిల్లర్లు తమ నిరవధిక బంద్‌ను విరమించుకున్నారు. దీంతో రైతులు రేపటి నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావచ్చని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. పత్తి దిగుబడి అధికంగా వచ్చిన రైతులు దిగులు చెందవద్దని సూచించిన కలెక్టర్, వెంటనే ఏఈఓలను సంప్రదించి దిగుబడిని ఆన్లైన్‌లో నమోదు చేయించుకోవాలని, ధృవీకరణ అనంతరం సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయించవచ్చని సూచించారు.

Join WhatsApp

Join Now