ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలో పి జె ఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఇస్రోజీవాడి గ్రామంలో ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు కళాశాల చైర్మన్ కే.గురవేందర్ రెడ్డి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్, రవీందర్ రెడ్డి విచ్చేసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు పలు సూచనలు సలహాలను అందజేశారు. ఈ కార్యక్రంలో గ్రామా కార్యదర్శి కల్పనా, ఏఎంసీ డైరెక్టర్ సుదర్శన్ రావు, ప్రిన్సిపాల్ విజయ్, కుమార్ గౌడ్, హన్మంత రావు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ గౌడ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ రెడ్డి, వెంకటేష్, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11