అంతరాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్ అమలు 

అంతరాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్ అమలు

దోపిడి కేసుల్లోనే నిందితులకు నిర్బంధ ఉత్తర్వులు జారీ

జిల్లా   ఎస్పీ రాజేష్ చంద్ర

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

నవంబర్ 15:

జాతీయ రహదారులపై దారి దోపిడి దొంగతనాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 14 తీవ్రమైన దారి దోపిడీ దొంగతనాల కేసుల్లో నిందితులకు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి పాటు ఒక సంవత్సర కాలం పాటు ఎటువంటి బేలు లేని జైలుకి పరిమితమయ్యే విధంగా వారిపై కఠిన చర్యలో భాగంగా పిడి యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు. జాతీయ రహదారులపై దొంగతనాలు, దారిదోపిడీలు, గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తూ, అలజడి వాతావరణం సృష్టించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పై కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుందని అన్నారు. ఈ దొంగల ముఠా సభ్యులైన కృష్ణ బాబు షిండే, రామ్ కిషన్ బోస్లే, రాందాస్, అజిత్ రమేష్, అజయ్ వీరి పైన పిడి యాక్ట్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మరో ప్రధాన నిందితుడు అయినా భాస్కర్ బాబురావు చావన్ పై పీడి యాక్ట్ అమలు చేశామన్నారు. ఈ నిందితులు సదాశివ నగర్, గాంధారి, తాడువాయి, పిట్లం, బీర్పూర్, మద్నూర్, పోలీస్ స్టేషన్లో తో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో కలిపి మొత్తం 14 అత్యంత ప్రమాదకర దారిదోపిడి కేసుల్లో నేరాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రధాన నిందితుడు నిజామాబాద్ సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడని తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ స్సాంగ్వన్ జారీ చేసిన పీడియాట్ ఉత్తర్వులను సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు కలిసి నిజామాబాద్ సెంట్రల్ జిల్లాలో పీడియాట్రి సంబంధించిన పత్రాలను నిందితులకు అందజేశారు.

Join WhatsApp

Join Now