నీటిపారుదల శాఖకు ఇంజినీర్లే వెన్నుముక

*@బంజారాహిల్స్ నుండి*

*నీటిపారుదల శాఖకు ఇంజినీర్లే వెన్నుముక*

#శాఖకు పటిష్ట పరచడంలో ఇంజినీర్లు భాగస్వామ్యం కావాలి

*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

నీటిపారుదల శాఖకు ఇంజినీర్లు వెన్నెముక లాంటి వారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు

సోమవారం సాయంత్రం తెలంగాణా నీటిపారుదల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రూపొందించిన 2025 క్యాలెండర్ తో పాటు డైరీని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ

ఇంజనీర్ల పనితనంతోటే శాఖాపనితీరుకు గుర్తింపు వస్తుందన్నారు.

నీటిపారుదల శాఖాను పటిష్టపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు

ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ నూనె శ్రీధర్,సెక్రటరీ జెనరల్ బి.గోపాలకృష్ణారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ వెగ్గలం ప్రకాష్,అసోసియేట్ ప్రెసిడెంట్ కే. సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీమహేంద్ర నాధ్,వైస్ ప్రెసిడెంట్ దొంతి కవిత లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శిలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now