వరద తాకిడికి బలహీన పడుతున్న కోడిపుంజుల వాగు
నూతన బ్రిడ్జి రివిటింగ్ దిమ్మెలు…
ఇంజనీర్ల డిజైన్ లోపమా…?
80 లక్షల సింగరేణి సొమ్ము వాగు పాలుఅయిందా ?
వర్షాకాలంలో అక్కరకు రాని బ్రిడ్జి
ఎందుకని సింగరేణి కార్మికుల ఆవేదన
సింగరేణి అధికారులు స్పందించాలి సామాజిక సేవకులు కర్నే బాబు రావు విజ్ఞప్తి
ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :
మణుగూరు లో సింగరేణి కార్మికుల రాకపోకలకు 80 లక్షల రూపాయల వ్యయంతో కోడిపుంజుల వాగుపై మామిడి చెట్ల గుంపు వద్ద గత ఏడాది సింగరేణి యాజమాన్యం నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి ఇంజనీర్ల డిజైన్ లోపంతో రివిటింగ్ దిమ్మెలు వరద తాకిడికి బలహీన పడుతున్నాయని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయని ఈ అంశంపై సింగరేణి అధికారులు స్పందించాలని మణుగూరు ప్రాంత సామాజిక సేవకులు కర్నే బాబురావు కోరారు, బుధవారం ఉదయం ఆయన బ్రిడ్జిని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి వర్షాకాలంలో కార్మికుల రాకపోకలకు ఉపయోగపడకపోతే ఏమి లాభం అని బ్రిడ్జి పైకి వరదరాగానే ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసులు, కూనవరం పంచాయతీ అధికారుల వాహనాల దారి మళ్లింపు తో డ్యూటీల రాకపోకలకు ఇబ్బంది అవుతోందని కార్మికులు వాపోతున్నారన్నారు, కార్మిక సంఘాల కార్మికుల అభ్యర్థుల మేరకు గత ఏడాది జులై 8వ న కోడిపుంజుల వాగుపై నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి అట్టహాసంగా ప్రారంభించారని, ఓపెనింగ్ చేసి నెల కాక ముందుకే 27 జులై నాడు భారీ వరదకు బ్రిడ్జి రివిటింగ్ దిమ్మెలు కొట్టుకుపోయాయన్నారు, పై అధికారులు సీరియస్ గా స్పందించడంతో మరలా కొంత సొమ్ము వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించినట్లు తెలుస్తోందన్నారు, ఈ సంవత్సరం భారీ వర్షాలతో పోటేత్తిన వరదలకు మరల రివిటింగ్ దిమ్మెలకు మరమ్మతులు చేయవలసి వచ్చింది, ఆకస్మికంగా పెద్ద ఎత్తున వరదలు వచ్చే కోడిపుంజుల వాగుపై పిల్లర్స్ తో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగ పాతిక 30 ఏళ్ల క్రితం తాత్కాలిక రాకపోకలకై నిర్మించిన తూరల చప్టా పునాదిగా పైన ఖర్చు తక్కువ నిర్మాణ సమయం తక్కువగా ఉంటుందని సి సి రోడ్డు లా ఐరన్ చిప్స్ తో సిమెంట్ కాంక్రీట్ స్లాబు వేశారని, పైనుంచి చూడ్డానికి పొడుగాటి బ్రిడ్జి లా ఉన్న భారీ వరదలను తట్టుకునే సామర్థ్యం లేని లోలెవెల్ బ్రిడ్జి నిర్మించారు, దీంతో భారీ వర్షాల సమయంలో రేగుల గండి చెరువు పెద్ద ఎత్తున నిండి వాగులో భారీగా వరద వచ్చినప్పుడు తూరల పైనుంచి ప్రవహించిన వరద నీరు ఇప్పుడు ఆనకట్టలా బ్రిడ్జి అడ్డు ఏర్పడడంతో లో లెవెల్ బ్రిడ్జిలో ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో దాని నష్టం చేస్తూ వరద ముందుకు సాగుతోంది, ఇదే వాగుపై కూనవరం రోడ్లు పాతిక ఏండ్ల క్రితం నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి కానీ, దిగువన 20 ఏళ్ల క్రితం సీతానగరం రోడ్డులో నిర్మించిన మినీ బ్రిడ్జి గాని ఎక్కడ డామేజ్ కాకపోవడానికి పిల్లర్లతో నిర్మించిన బ్రిడ్జిలే కారణమని ఇంజనీరింగ్ పై అవగాహన లేని వారు సైతం చెప్పవచ్చు నిర్మాణాలపై ఎంతో అవగాహన ఉన్న సివిల్ ఇంజనీర్లు ఉన్న సింగరేణిలో కోడిపుంజుల వాగు లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రణాళికలో ఎందుకు లోపం జరిగిందో ఇప్పటికైనా సింగరేణి డైరెక్టర్లు దృష్టి పెట్టాలి, సమస్య పరిష్కారానికి ఏరియా కార్మిక సంఘాల నాయకులు కూడా చొరవ చూపాలని బాబురావు విజ్ఞప్తి చేశారు, కొంత ఆలస్యమైన కోడిపుంజుల వాగుపై పిల్లర్లతో నిర్మించే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణమే పరిష్కార మార్గంగా ఆలోచన చేయాలి,సింగరేణి కార్మికులతో పాటు వివిధ గల డిపార్ట్మెంట్ లకు విధులకు హాజరయ్యే అధికారులు కావచ్చు ఏరియా జిఎం కావచ్చు ఈ బ్రిడ్జి పైనుండే ప్రయాణించాల్సి ఉంటుంది, ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం దిశగా ఆలోచించాలని, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని కూనవరం హై లెవెల్ బ్రిడ్జికి పై నుండి ఇదే కోడిపుంజుల వాగులో పూడిక కూడా తీయాల్సి ఉందని పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉందని గని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారని బాబురావు అన్నారు.