సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ ఎస్ రమేష్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నె బాబూ రావు
పీవీ కాలనీ సింగరేణి పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని మెరుగైన విద్యాబోధనకు చర్యలు చేపట్టాలని కోరుతూ మణుగూరు కు చెందిన సామాజిక సేవకులు కర్నె బాబూ రావు శనివారం నాడు సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ మణుగూరు ఏరియా కరస్పాండెంట్ ఎస్ రమేష్ ఏరియా (అదికార ప్రతినిధి) కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబూ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా పీ వి కాలనీ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హైస్కూల్ లో నిబంధన ప్రకారం తగు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా బోధన నత్తనడకన కొనసాగుతోందని పాఠశాలలు ప్రారంభించి నాలుగు నెలలు గడచినా పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ,బయాలజీ మాధ్యమాలకు సంబంధించి ఉపాధ్యాయులు లేరని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కాంట్రాక్టు గడువు ముగిసిపోవడం మరి కొంతమంది ఉపాధ్యాయునిలు ప్రసూతి సెలవులో ఉండటం ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిసిందన్నారు. దీంతోపాటు సెక్షన్లు విభజించకుండా 100 మంది విద్యార్థుల్ని ఓకే రూమ్ లో కూర్చోబెట్టడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురి అవుతున్నారన్నారన్నారు, అనారోగ్య సమస్యలు కూడా ఉత్పనమవుతాయని అభిప్రాయపడ్డారు. దయచేసి ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరయ్యేలా చూడడంతో పాటు సెక్షన్లను విభజించాలని డైనింగ్ హాల్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని సింగరేణి పాఠశాలకు ఉన్న పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లకుండా విద్యాబోధన క్రమశిక్షణ ఉండేలా చూడాలని ఆయన సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ అధికారులను కోరారు. రమేష్ సానుకూలంగా స్పందించినందుకు బాబురావు ధన్యవాదాలు తెలిపారు .