*అలరించిన ముగ్గుల పోటీలు*
*జమ్మికుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*
పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో హైకాన్ యూత్ ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఆద్యంతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి జమ్మికుంట మాజీ ఎంపీపీలు నేరెళ్ల రాజమల్లుగౌడ్, గంగారపు లత శ్యామ్, మాజీ ఉప సర్పంచులు కాయిత లింగారెడ్డి, పోషిని సత్యనారాయణ, బొనగాని యాదగిరి హాజరయ్యారు.మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి ముగ్గుల పోటీలో పాల్గొని సంక్రాంతి పండుగ ఆవశ్యకతను మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రజలకు అర్థమయ్యేలా రంగు రంగుల హరివిల్లులో ముగ్గులను తీర్చిదిద్దారు.ముగ్గుల పోటీలో పాల్గొన్న అంబాల శిరీష ప్రధమ బహుమతి, గంగారపు సాయిప్రియ ద్వితీయ బహుమతి, గంగారపు అనూష తృతీయ బహుమతులు గెలుపొందగా వారికి బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలలో మొత్తం 44 మంది మహిళలు పాల్గొనగా ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హైకాన్ యూత్ సభ్యులు బహుమతులు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి,సంప్రదాయాలను తెలియజేసేలా వేసిన ముగ్గులు అందర్నీ ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు గంగారపు ప్రదీప్- మమత, గజ్జల లక్ష్మి, గణపాక లక్ష్మి శోభ అంబాల సతీష్, అంబాల సాయిలు, గంగారపు తిరుపతి కోడెపాక అరవింద్ లకు నిర్వాహకులు గంగారపు నాగరాజు సాయిరాం విక్రమ్ రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లు నేరెళ్ల రాజమల్లు గౌడ్, గంగారపు లతా శ్యామ్, ఉప సర్పంచులు కాయిత లింగారెడ్డి,పోషిని సత్యనారాయణ,బొనగాని యాదగిరి,ముగ్గుల పోటీ నిర్వాహకులు, మహిళలు కాలనీవాసులు హైకాన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.